🏠 peoplesvoice.news
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 12:15 pm Posted by : peoplesvoice

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

News Image
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
చింతకాని, అక్టోబర్ 2 (ఆయుధం):
చింతకాని మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా చింతకాని గ్రామ సెంటర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను, ఆయన పాటించిన సత్యాగ్రహం, అహింసా మార్గాలను కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు, మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి చల్లా కృష్ణారావు, గౌరవాధ్యక్షులు వేములపల్లి సూర్యనారాయణ, మండల సభ్యులు చల్లా వెంకటేశ్వర్లు, పెనుగొండ రామారావు, గుర్రం శ్రీనివాసరావు, కొండ ఉమాశంకర్, దేవిశెట్టి వినోబా, తేలుకుంట్ల శంకర్రావు, గుండా శీను, తల్లాడ మురళి, బిజ్జాల చంద్రశేఖర్ తదితరులతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home