Poples Voice
Date of Publish : 21/10/2026, 7:05 pm
Published by PEOPLES VOICE

టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్

  • టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్
  • నియామక పత్రం అందజేసిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత

టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్

నియామక పత్రం అందజేసిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత

ఖమ్మం, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): తెలంగాణ ఉద్యమకారుడు, యువ నాయకుడు షేక్ హుస్సేన్‌ను టీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. మొదటి నుంచి కల్వకుంట్ల కవిత అనుచరుడిగా కొనసాగుతున్న ఆయనకు ఖమ్మం జిల్లాలో పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా షేక్ హుస్సేన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఖమ్మం జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Status Save