ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత కోసం బీఆర్‌ఎస్ మహాధర్నా
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో పాల్గొన్న చింతకాని బీఆర్‌ఎస్ నాయకులు
చింతకాని , అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్)
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో చింతకాని మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి గ్రామసభల ద్వారా నిజమైన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఎంపిక చేసిన అర్హుల జాబితా ఆధారంగా లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.