Poples Voice
Date of Publish : 22/10/2026, 9:31 pm
Published by PEOPLES VOICE

బీసీలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి _ యలమందల జగదీష్ డిమాండ్

  • బీసీలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
  • నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి
  • బీసీ సంక్షేమ సంఘం నేతలు పొదిల సతీష్ యాదవ్, యలమందల జగదీష్ డిమాండ్

బీసీలకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం నేతలు పొదిల సతీష్ యాదవ్, యలమందల జగదీష్ డిమాండ్

ఖమ్మం, అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ నాయకులకు కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొదిల సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి యలమందల జగదీష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేస్తున్న డాక్టర్ లోకేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జంపాల రాజేష్‌కు ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన లోకేష్ యాదవ్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలని కోరారు. బీసీ వర్గాలకు చెందిన నాయకులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014, 2018, 2023 ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవుల్లో బీసీలకు తగిన అవకాశాలు కల్పించలేదని వారు ఆరోపించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“ఓట్లు మావి.. సీట్లు మీవా?” అంటూ బీసీలకు రాజకీయ పదవుల్లో న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు న్యాయం చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలి

ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. బీసీ వర్గాలకు చెందిన అర్హులైన నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో బత్తుల వీరబాబు, పగడాల హనుమంతరావు, రాగం కోటి, నాగరాజు, వినయ్, వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save