Poples Voice
Date of Publish : 23/10/2026, 1:42 pm
Published by PEOPLES VOICE

ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో ఈవీ కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం!

  • ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో ఈవీ కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం!
  • అప్రమత్తమై కారు దిగిపోయిన ప్రయాణికులు.. తప్పిన ప్రాణాపాయం
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.. ట్రాఫిక్‌కు అంతరాయం

ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో ఈవీ కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం!

అప్రమత్తమై కారు దిగిపోయిన ప్రయాణికులు.. తప్పిన ప్రాణాపాయం

మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.. ట్రాఫిక్‌కు అంతరాయం

ఖమ్మం, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం నగరంలోని వెంకటాయపాలెం సమీపంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కొత్తగూడెం వైపు వెళ్తున్న ఓ ఈవీ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

కారులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

గత ఘటన నేపథ్యంలో ఆందోళన

ఇటీవల ఈవీ కారులో మంటలు చెలరేగిన ఘటనలో ఖమ్మంకు చెందిన ప్రముఖ వైద్యుడు జగదీష్ సజీవ దహనమైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తాజాగా మరో ఈవీ కారులో మంటలు చెలరేగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో ప్రయాణికులు సకాలంలో అప్రమత్తమై కారు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save