Poples Voice
Date of Publish : 23/10/2026, 7:26 pm
Published by PEOPLES VOICE

గాయపడిన కౌన్సిలర్‌ కుమారుడిని పరామర్శించిన సండ్ర

గాయపడిన కౌన్సిలర్‌ కుమారుడిని పరామర్శించిన సండ్ర

లోహిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

కల్లూరు, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

కల్లూరు మండల బీఆర్‌ఎస్‌ పార్టీ యూత్ ప్రెసిడెంట్, 18వ వార్డు కౌన్సిలర్ పెడకంటి రామకృష్ణ కుమారుడు లోహిత్ కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ఇటీవల కాలికి గాయమై ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న లోహిత్‌ను ఆసుపత్రిలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పెడకంటి రామకృష్ణ, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. లోహిత్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని సండ్ర ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సండ్రకు కృతజ్ఞతలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save