Poples Voice
Date of Publish : 23/10/2026, 7:41 pm
Published by PEOPLES VOICE

ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ

ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ

సర్టిఫికెట్లు, శిక్షణ, వైద్యుల సమస్యలపై చర్చ

ముదిగొండ, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలోని మామిడితోట వద్ద ఈ నెల 25న ఆదివారం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 7వ మహాసభ నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సభకు నేరెళ్ల నరసింహారావు అధ్యక్షత వహించనున్నారు.

కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ పూర్తి చేసిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, మిగిలిన వారికి శిక్షణ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ వైద్యులపై దాడులను నిలిపివేయాలని, వారు ప్రాథమిక చికిత్సకే పరిమితం కావాలనే అంశంపై కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

సభకు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎ. వెంకటాచారి హాజరుకానున్నారు. ఉదయం మూసా గాన కచేరీ, మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

గ్రామీణ వైద్యులు గుర్తింపు కార్డులతో హాజరై సభను విజయవంతం చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు వర్ధన్ రాజ్, ఉపాధ్యక్షులు ఖలీల్, పి. మోహనరావు, నాగేశ్వరరావు, కార్యదర్శులు రాజశేఖర్, శ్రీనివాస్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు షేక్ సోందుసాహెబ్ కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save