Poples Voice
Date of Publish : 24/10/2026, 9:32 am
Published by PEOPLES VOICE

పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

  • పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
  • కొత్త రుణాలు పొందాలని రైతులకు సొసైటీ చైర్మన్ యలగొండ స్వామి సూచన

పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కొత్త రుణాలు పొందాలని రైతులకు సొసైటీ చైర్మన్ యలగొండ స్వామి సూచన

ముదిగొండ, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

ముదిగొండ విశాల సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులు కొత్త పంట రుణాలు పొందవచ్చని సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు పంట రుణాలు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సంఘం నుంచి రుణాలు పొందిన రైతులు వాటిని రెన్యువల్ చేయించుకునేందుకు సిబ్బందికి సహకరించాలని యలగొండ స్వామి కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save