పట్టభద్రుల ఓటరు నమోదును విజయవంతం చేయాలి
నవంబర్ 1లోగా అర్హులైన పట్టభద్రుల నమోదు పూర్తి చేయాలి: రాయల నాగేశ్వరరావు
ఖమ్మం, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి రాయల నాగేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం నగరంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో రఘునాథపాలెం మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన, కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. నవంబర్ 1వ తేదీలోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు, నల్లమల్ల ఆనంద్, దేవ్ సింగ్, కొంటెమొక్కుల నాగేశ్వరరావు, కోటేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.