Poples Voice
Date of Publish : 24/10/2026, 7:07 pm
Published by PEOPLES VOICE

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు పెంచాలి.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మార్పీఎస్‌ వినతి

  • ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు పెంచాలి.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మార్పీఎస్‌ వినతి
  • అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలి.. బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు పెంచాలి.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మార్పీఎస్‌ వినతి

అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలి.. బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

చింతకాని, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఇళ్ల కేటాయింపుల సంఖ్య పెంచడంతో పాటు బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు.

శనివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను గాంధీనగర్‌ కాలనీ వద్ద ఎమ్మార్పీఎస్‌ నాయకులు కలిసి తమ విజ్ఞప్తులను వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మరిన్ని ఇళ్లు కేటాయించాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో చింతకాని మండల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు నాగేంద్రబాబు, మండల సీనియర్‌ నాయకులు పగిడిపల్లి రవీంద్ర, చిర్రా ఉపేందర్‌, వేల్పుల హరికృష్ణ, జిల్లపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save