Poples Voice
Date of Publish : 24/10/2026, 7:20 pm
Published by PEOPLES VOICE

కూసుమంచి ఎస్‌ఐ సతీష్‌కు శుభాకాంక్షలు

కూసుమంచి ఎస్‌ఐ సతీష్‌కు శుభాకాంక్షలు

కూసుమంచి, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ కె. సతీష్‌ను గైగొళ్లపల్లి గ్రామ సర్పంచ్ అనూష సైదులు, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తోడేటి మల్లయ్యతో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు జిల్లా హుస్సేన్, ముదిరెడ్డి మనోహర్ రెడ్డి, మూల్కూరు శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు నాగ పుల్లయ్య, బిక్షం, బీఆర్‌ఎస్ నాయకులు బెల్లి శ్రీశైలం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save