మహా ధర్నాను జయప్రదం చేయాలి
ఎంపీఓకు వినతిపత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు
ముదిగొండ, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్):
ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ముదిగొండ మండల ఎంపీఓ రామకృష్ణకు సీఐటీయూ మండల నాయకులు వినతిపత్రం అందజేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాకు కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్.కె. హుస్సేన్, ఇరుకు రాము, పల్లెపొంగు రవి, పల్లపాటి శ్రీకాంత్, ఉపేందర్, నాగేశ్వరరావు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.