Poples Voice
Date of Publish : 25/10/2026, 8:25 pm
Published by PEOPLES VOICE

ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల స్థలం కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్

ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల స్థలం కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్

ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు, సంక్షేమ విధానం ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

సత్తుపల్లి, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు పిడమర్తి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇందిరా పార్క్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సింహగర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గౌరవం, ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని లక్ష మంది ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేలా ప్రత్యేక సంక్షేమ విధానాన్ని ప్రకటించి, అర్హులైన వారిని గుర్తించాలని సూచించారు.

ఉద్యమకారులకు న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ లభిస్తుందని, వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పిడమర్తి రవి వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తమ సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు, సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save