Poples Voice
Date of Publish : 26/10/2026, 10:14 am
Published by PEOPLES VOICE

పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

కూసుమంచి, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో అదుపుతప్పి పత్తి చేలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save