వందనం గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పునకు ముందడుగు.. బీటీ రోడ్డు పనులు ప్రారంభం
చింతకాని, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్): చింతకాని మండలం వందనం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషితో గంగమ్మ గుడి వద్ద ప్రధాన రహదారి నుంచి పుట్టకోట లింకు రోడ్డు వరకు ఈ పనులు చేపట్టారు.
రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలగడంతో పాటు రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ అమరలపూడి శ్రీను, గ్రామ అధ్యక్షుడు పొన్నం చిన్న శంకర్రావు, ఉపాధ్యక్షుడు ఎస్.కె. మోయిన్, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పొన్నం పెద్ద శంకర్రావు, లకావత్ వెంకటేశ్వర్లు, వేములపల్లి హరీష్, ఆవుల రామారావు, ఆవుల రాము, ఊరు సురేష్, నారపోగు హరీష్, ఉసికల సురేష్, ఆవుల రమేష్, కాకరకాయల నరేష్, ఎల్లవుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.