Poples Voice
Date of Publish : 04/11/2026, 6:02 pm
Published by PEOPLES VOICE

లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత!

లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత!

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరంకు చెందిన అజ్మీరా చిన్న ప్రసాద్ కుమార్తె లాస్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వద్దిరాజు రవిచంద్ర రూ.2 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థిక సాయం మంజూరు చేయించారు.తన కుమార్తె ఆరోగ్య పరిస్థితిని ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు వివరించగా, ఆయన వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షలు మంజూరు చేయించారు.ఈ మేరకు బుధవారం ఖమ్మం బుర్హాన్‌పురంలోని తన క్యాంపు కార్యాలయంలో లాస్యశ్రీ తండ్రి చిన్న ప్రసాద్‌కు సంబంధిత లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం అందించిన ఎంపీకి చిన్న ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save