Poples Voice
Date of Publish : 04/11/2026, 9:44 pm
Published by PEOPLES VOICE

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!

నవంబర్ 6న కైకొండాయిగూడెంలో అమరవీరుల సభ

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

నవంబర్ 6న ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం గ్రామంలో నిర్వహించనున్న అమరవీరుల సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలో పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ సభకు ప్రజలు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విస్తృత ప్రచారం నిర్వహించారు.అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సభకు ప్రజలను సమీకరించే లక్ష్యంతో పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు, ప్రజలకు కరపత్రాలు అందజేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకురాలు సీహెచ్ శిరోమణితో పాటు నాయకులు కే. శ్రీనివాస్, బొమ్మకంటి రమేష్, సాగర్ రెడ్డి, వెంకన్న, మల్సూర్, శోభన్, దాసు, ప్రవీణ్, నాగేశ్వరరావు, రామరాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save