కొదుమూరులో ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!
యువజన హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి – నాయకుల పిలుపు
చింతకాని, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
కొదుమూరు గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఎం పార్టీ మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మరియు చింతకాని మండల సీపీఎం పార్టీ కార్యదర్శి దేశబోయిన ఉపేందర్ పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతకాని మండల డివైఎఫ్ఐ కార్యదర్శి నక్కనబోయిన అజయ్ గోపి కొదుమూరు సీపీఎం గ్రామ కార్యదర్శి నక్కనబోయిన శాంతారావు పాల్గొన్నారు అలాగే కొదుమూరు గ్రామ శాఖ డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు బందెల జగదీష్ నక్కనబోయిన రాజేష్ గ్రామ కమిటీ సభ్యులు బోళ్ల ఉపేందర్ బోళ్ల కిరణ్ నక్కనబోయిన సురేష్ నాగరాజు సతీష్ రాజు మరో నాగరాజు ఉపేందర్ గోపాలరావు బందెల క్రాంతి సాయి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.