Poples Voice
Date of Publish : 05/11/2026, 9:12 pm
Published by PEOPLES VOICE

వైభవంగా నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థం.. నూతన జంటను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేతలు!

వైభవంగా నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థం.. నూతన జంటను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేతలు!

నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ వీరబాబు, పార్టీ నాయకులు

చింతకాని, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
మండల పరిధిలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన మడిపల్లి నాగయ్య – తులసమ్మ (లేటు) దంపతుల కుమార్తె కోటేశ్వరి, చీమలదారి వెంకటనారాయణ దంపతుల కుమార్తె నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని మారెమ్మ గుడి సమీపంలోని అమ్మ ఫంక్షన్ హాల్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తిరుమలాపురం గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ చాపలమడుగు వీరబాబుతో పాటు గ్రామ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యమకారుడు గోదా రవీందర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు బండి రామారావు, గోగుల నరసింహారావు, బండి సైదులు, సువర్ణ, కంటి నాగేశ్వరరావు, బండి యాకోబు, బండి గోపీనాథ్, మరీదు రాము, మడిపల్లి రామకృష్ణ, మడిపల్లి పెంటయ్య, చాపలమడుగు సైదులు, మడిపల్లి శీను తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save