Poples Voice
Date of Publish : 07/11/2026, 6:17 pm
Published by PEOPLES VOICE

పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు!

పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు!

రూ.20.04 లక్షలతో ఎక్స్‌టెన్షన్ విద్యుత్ స్తంభాల పనులు ప్రారంభం

చింతకాని, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.20.04 లక్షల నిధులతో ఈ పనులను చేపట్టారు.గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల సమీపంతో పాటు దూరప్రాంతాల్లో ఉన్న నివాసాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు లో-వోల్టేజీ సమస్యలను అధిగమించే లక్ష్యంతో ఎక్స్‌టెన్షన్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల ప్రారంభంతో గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ, వత్సవాయి జానకిరాములు, ఉప సర్పంచ్ మేకల కల్పన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగ సూరా రెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనం ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే ఎన్పీడీసీఎల్ బోనకల్ ఏడీఈ, నాగులవంచ ఏఈ, సంబంధిత కాంట్రాక్టర్, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save