వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు
పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు
చింతకాని, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):
దీపావళి పండుగ సందర్భంగా చింతకాని మండలం తిరుమలాపురం గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. గ్రామంలో ఐకమత్యం, ప్రేమాభిమానాలు మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సర్పంచ్ వీరబాబు కోరారు.