Poples Voice
Date of Publish : 08/11/2026, 9:02 am
Published by PEOPLES VOICE

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి

చింతకాని మండల ప్రజలకు సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు శుభాకాంక్షలు
చింతకాని, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

దీపావళి పండుగను పురస్కరించుకుని వందనం గ్రామంతో పాటు మండలంలోని ప్రజలందరికీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.గ్రామ, మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. సమాజంలో ప్రేమాభిమానాలు, సోదరభావం, ఐకమత్యం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.పండుగ సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా దీపావళి జరుపుకోవాలని సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save