Poples Voice
Date of Publish : 08/11/2026, 10:19 pm
Published by PEOPLES VOICE

చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఖమ్మం,నవంబర్ 08 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో ఘనంగా నిర్వహించారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా చల్లా కృష్ణ టీమ్ సభ్యులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరిన్నిసేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చల్లా కృష్ణ టీమ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save