ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చింతకాని, అక్టోబర్ 2 (ఆయుధం): చింతకాని మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా చింతకాని గ్రామ సెంటర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను, ఆయన పాటించిన సత్యాగ్రహం, అహింసా మార్గాలను కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు,...