గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పోలీస్ కమిషనర్ నివాళులు

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పోలీస్ కమిషనర్ నివాళులు ఖమ్మం, అక్టోబర్ 2 (ఆయుధం): గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ **సునీల్ దత్** మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ప్రపంచానికి చాటిచెప్పిన **సత్యం, అహింస, శాంతి, నైతిక విలువల** మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గాంధీజీ ఆశయాలను ఆచరించడం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో **అడిషనల్ డీసీపీలు...