జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి చింతకానిలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం చింతకాని, అక్టోబర్ 2 (ఆయుధం): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కార్యవర్గ సభ్యులు గార్లపాటి రమేష్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చింతకాని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో స్థానిక చింతకాని సెంటర్‌లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గార్లపాటి రమేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య భద్రత, ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ...