09/11/2026, Monday · 01:13:09 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice
Peoples Voice

This is Short News — best viewed on mobile.

News ePaper
Yakub Pasha
Founder & Editor-in-Chief
17 hours ago

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

పాఠకులకు, పాత్రికేయ మిత్రులకు, నాయకులకు, అభిమానులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాల వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పాషా Peoples Voice™

Yakub Pasha
Founder & Editor-in-Chief
6 days ago

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యం! _ ఆకుతోట ఆదినారాయణ

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. సమిష్టి కృషితోనే సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. అధికారులతో చర్చలు, సమన్వయంతో ఖమ్మం జిల్లాలో 1,200 అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. అల్లం నారాయణ ఉద్యమ స్ఫూర్తితో సంఘాన్ని బలోపేతం చేయాలని చిర్రా రవి పిలుపునిచ్చారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
12 days ago

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యం

చింతకాని మండల కాంగ్రెస్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మధిర నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి పొట్ల నాగేశ్వరరావు పిలుపు. అర్హులైన గ్రాడ్యుయేట్లు నవంబర్ 6లోగా ఓటర్లుగా నమోదు కావాలని సూచన

Yakub Pasha
Founder & Editor-in-Chief
12 days ago

ఎల్‌నినోపై వందనం గ్రామసభ.. నీటి పొదుపు, ఆరుతడి పంటలపై సూచనలు

వందనం గ్రామంలో సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, కార్యదర్శి అయినాల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
13 days ago

సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు హరికిషన్ విజ్ఞప్తి

తిరుమలాయపాలెం మండలం హైదరుసాయిపేటలో సాగు భూమి పట్టా విషయంలో వివాదం నెలకొంది. తాను సాగు చేస్తున్న భూమి పట్టా వేరొకరి పేరుపై ఉందని యువ రైతు గుగులోతు హరికిషన్ తెలిపారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనల ప్రకారం సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
14 days ago

లింగాల కమలరాజు జన్మదిన వేడుకల్లో వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు

మధిర, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్): మధిర బీఆర్ఎస్ ఇన్‌చార్జి లింగాల కమలరాజు జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో వందనం గ్రామ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నారపోగు రాజేష్, మిట్టపల్లి కిషోర్, నారపోగు వాసు, మిట్టపల్లి వెంకటరత్నం, దంతలపల్లి విజయ్, నారపోగు కిషోర్, మిట్టపల్లి బాలరాజు పాల్గొన్నారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
15 days ago

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టపరమైన చిక్కులు లేని, నివాసయోగ్యమైన ప్రాంతాల్లో స్థలాల కేటాయింపునకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
17 days ago

TUWJ-TJF ఖమ్మం డివిజన్ మహాసభ వాయిదా

ఖమ్మం, అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్): ఈ నెల 24న నిర్వహించాల్సిన TUWJ-TJF ఖమ్మం డివిజన్ మహాసభను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కోర్ కమిటీ సభ్యులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి తెలిపారు. మహాసభ నిర్వహించే తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
17 days ago

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరపాలి: ఖమ్మంలో అఖిలపక్ష ధర్నా

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. గ్రామసభల ద్వారా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పలువురు వామపక్ష, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
18 days ago

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్ కోడ్ల ద్వారా బియ్యం సరఫరాపై పర్యవేక్షణ పెంచి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం. ✅ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవడం స్వాగతించదగిన విషయం!