09/11/2026, Monday · 01:13:06 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice
Peoples Voice

This is Short News — best viewed on mobile.

News ePaper
Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో అధికారులు వీఐపీ, సిఫార్సు దర్శనాలను రద్దు చేశారు. ఉచిత దర్శనానికి మాత్రమే అనుమతిస్తూ భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,47,430గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,140గా నమోదైంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలో రూ.2,29,900కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,47,580గా ఉంది. ధరలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలు ముందు తాజా రేట్లు పరిశీలించాలి.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

ఏఐ వార్మ్‌లతో ప్రపంచానికి ముప్పు.. నిపుణుల హెచ్చరిక!

ఇంటర్నెట్‌కు అనుసంధానమైన పరికరాల్లోకి చొరబడి, వాటి నుంచి ఇతర పరికరాలకు వ్యాపించే ఏఐ వార్మ్‌లపై ఆంథ్రోపిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఐఓటీ పరికరాలను ఇవి లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపారు. స్వయంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన ఈ ముప్పు సైబర్ భద్రతకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

ఢిల్లీలో ధర్నాలతో రూ.2,000 కోట్ల నష్టం.. కోర్టును ఆశ్రయించిన వ్యాపారి!

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిరసనలతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రెస్టారెంట్ యజమాని ఆయుష్ చోప్రా హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 10న జరిగిన ఆందోళనతో కన్నాట్ ప్లేస్‌లో రూ.150–200 కోట్లు, ఢిల్లీ వ్యాప్తంగా రూ.2,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధ్యుల నుంచి పరిహారం ఇప్పించాలని కోరగా, విచారణను 27కు కోర్టు వాయిదా వేసింది.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

ప్రళయ గ్లేసియర్‌పై ఆందోళన.. అంచనాలకు మించి కరుగుతున్న త్వైట్స్!

అంటార్కిటికాలోని త్వైట్స్ హిమానీనదం అంచనాలకు మించి వేగంగా కరుగుతోందని పరిశోధకులు హెచ్చరించారు. వెచ్చని సముద్రపు నీరు అడుగుభాగంలోకి చొచ్చుకెళ్లడం వల్ల 2100 నాటికి సముద్ర మట్టాల పెరుగుదలకు దీని వాటా 30 మిల్లీమీటర్లకు చేరవచ్చని అంచనా. గ్లేసియర్ పూర్తిగా కూలిపోతే సముద్ర మట్టాలు 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

పుంగనూరులో ఘర్షణలు.. నిబంధనల ఉల్లంఘనపై ఎస్పీ సీరియస్!

పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద ఘర్షణలపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలతో కేంద్రంలోకి వచ్చారని, ఘర్షణలో పలువురు గాయపడ్డారని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Yakub Pasha
Founder & Editor-in-Chief
23 days ago

అధిష్టానం ఆదేశాల మేరకే ముందుకు సాగుతున్నామని జనసేన మున్సిపల్ అభ్యర్థి

అధిష్టానం ఆదేశాల మేరకే ముందుకు సాగుతున్నామని జనసేన మున్సిపల్ అభ్యర్థి అద్దేపల్లి సౌజన్య తెలిపారు. బలం ఉన్న చోట స్నేహపూర్వకంగా పోటీ చేయాలని, న్యాయం జరగని పక్షంలో ఎన్నికల బరిలోకి దిగాలని అధిష్టానం సూచించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు.