జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందివ్వాలి

టిజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి డిమాండ్

ఖమ్మంలో ఆందోళన బాట పట్టిన జర్నలిస్టులు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టిజేఎఫ్ పోస్టు కార్డు ఉద్యమం

గాంధీ జయంతి నాడు జర్నలిస్టుల నిరసన గళం

ఖమ్మం అక్టోబర్ 2:

జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తక్షణమే మానుకోవాలని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించకపోగా వారి పట్ల చిన్న చూపు చూడడం సరైనది కాదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అన్నారు.

టి యు డబ్ల్యూ జే (టీజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో జర్నలిస్టులు వారం రోజులు పాటు చేపట్టే పోస్ట్ కార్డు ఉద్యమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Message Us on WhatsApp