07/11/2026, Saturday · 11:07:20 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత!

Yakub Pasha 07/11/2026 8:30 AM క్రైమ్

బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత!
Want this news as a newspaper clip?Print News Clip
  • బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి
  • ఐదుగురు పట్టివేత.. రూ.10,400 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం

బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత!

రూ.10,400 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం.. మరో ఇద్దరు పరారీ

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం నగర శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలపేట గ్రామ శివారులో ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడి నిర్వహించారు.టాస్క్‌ఫోర్స్ సీఐ ఉదయ్ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి నుంచి రూ.10,400 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.పట్టుబడిన వారిని ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఎస్.కె. రఫీ, షేక్ హుస్సేన్, మొగిలి ఉపేందర్, మద్దనపు సత్యనారాయణ, లకావత్ బాలు ఉన్నారు. పరారీలో ఉన్నవారిని జరాల రమేష్, చల్ల అశోక్‌గా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Pekata baseTaskForceraidsBalapetsuburbfivearrested

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు! ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!