29/11/2026, Sunday · 08:18:05 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్!

Yakub Pasha 28/11/2026 9:02 AM ఖమ్మం

పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్!
Want this news as a newspaper clip?Print News Clip

పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్!

జిల్లా అధ్యక్షుడిగా తిమ్మడి రఘు.. ప్రధాన కార్యదర్శిగా తిప్పారపు లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక

విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తాం – నూతన అధ్యక్ష, కార్యదర్శులు

ఖమ్మం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. గురువారం ఖమ్మం పట్టణంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నిర్మాణ జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పాలేరుకు చెందిన తిమ్మడి రఘు, ప్రధాన కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన తిప్పారపు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. శుక్రవారం పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికను ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.అదేవిధంగా ఇంటర్ విద్యను రద్దు చేయడం వల్ల విద్యారంగంపై పడే ప్రభావాలు, భవిష్యత్ పరిణామాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఇంటర్ విద్య రద్దు – పరిణామాలు, విద్యారంగంపై ప్రభావం' అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన జిల్లా కమిటీ వివరాలు:

- జిల్లా అధ్యక్షుడు: తిమ్మడి రఘు (పాలేరు)

- జిల్లా ప్రధాన కార్యదర్శి: తిప్పారపు లక్ష్మణ్ (ఖమ్మం)

- ఉపాధ్యక్షుడు: గంట మనోహర్

- సహాయ కార్యదర్శి: పాండవుల సుశాంత్

- కోశాధికారి: బానోత్ స్టాలిన్

- కమిటీ సభ్యులు: కార్తీక్, గణేష్, వెంకటేష్, సిద్ధు

- మరో నలుగురు కో-ఆప్షన్ సభ్యులతో కలిపి మొత్తం 13 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్

raghu lakshmanpidiesyukhammamjillanutanasarathuluga

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు