07/11/2026, Saturday · 11:07:22 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి!

Yakub Pasha 07/11/2026 6:06 PM క్రైమ్

వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి!
Want this news as a newspaper clip?Print News Clip

వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి!

ముగ్గురు నిందితుల గుర్తింపు.. ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం

ఖమ్మం, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మహిళల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి అక్రమ కార్యకలాపాలనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.శుక్రవారం రాత్రి ఖమ్మం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ), షీ టీమ్స్ బృందాలు సంయుక్తంగా ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మెరుపు దాడి నిర్వహించాయి. ఈ దాడిలో అక్కడ ఉన్న ముగ్గురు బాధిత మహిళలను పోలీసులు రక్షించారు.ఈ అక్రమ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వీరిలో వ్యభిచార గృహ నిర్వాహకులతో పాటు విటులు ఉన్నట్లు వెల్లడించారు. దాడి సందర్భంగా ఐదు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ కలిపి మొత్తం ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.మహిళల అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం, మహిళలపై దోపిడీ వంటి నేరాలకు పాల్పడే వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఈ కేసుకు సంబంధించిన వివరాలు, స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Lightning AttackAHTUSheTeamsAdulterousHouseWomenReleased

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు! ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!