చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

- స్టేషన్ పరిసరాలు, కేసు ఫైళ్ల పరిశీలన.. ఎస్ఐ నరేష్‌తో పాటు సిబ్బంది పనితీరుపై ప్రశంసలు
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ఐ, సిబ్బందికి రివార్డులు ప్రకటించిన సీపీ
చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
చింతకాని, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం పోలీస్ కమిషనర్ ఈరోజు చింతకాని పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, నిర్వహణ తీరును, వివిధ కేసులకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, విధుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించిన పోలీస్ కమిషనర్, చింతకాని ఎస్ఐ నరేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పనితీరును అభినందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్ఐ నరేష్, సిబ్బందికి రివార్డులు ప్రకటించి వారిని ప్రోత్సహించారు.పోలీస్ స్టేషన్ నిర్వహణతో పాటు విధి నిర్వహణలో సిబ్బంది చూపిన ప్రతిభను కమిషనర్ ప్రశంసించడం పట్ల పోలీస్ సిబ్బందిలో హర్షం వ్యక్తమైంది.
ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్












