04/11/2026, Wednesday · 06:43:41 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అంగన్వాడీల పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యమెందుకు?

Yakub Pasha 27/10/2026 1:52 PM ఖమ్మం

అంగన్వాడీల పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యమెందుకు?
Want this news as a newspaper clip?Print News Clip
  • అంగన్వాడీల పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యమెందుకు?
  • చిన్నారుల భద్రత స్థానిక సంస్థలదే.. హెల్పర్లపై అదనపు భారం వద్దు: షేక్ సుభహన్

అంగన్వాడీల పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యమెందుకు?

చిన్నారుల భద్రత స్థానిక సంస్థలదే.. హెల్పర్లపై అదనపు భారం వద్దు: షేక్ సుభహన్

ఖమ్మం, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్): అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ సుభహన్ డిమాండ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల పాములు, తేళ్లు వంటి విషపురుగులు కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని, దీనిని నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్రాల లోపలి పరిశుభ్రత హెల్పర్ల విధుల్లో భాగమైనప్పటికీ, బయట పరిసరాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల నిర్వహణ, వీధులు, బహిరంగ ప్రదేశాల శుభ్రత బాధ్యతలను సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. హెల్పర్లపై వారి విధులకు మించి అదనపు పారిశుద్ధ్య పనులను బలవంతంగా మోపడం సరికాదన్నారు.

ఖమ్మం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశీలించి, క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులను కోరారు. చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించడంతో పాటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించాలని షేక్ సుభహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

parishuddhyampai nirlakshyamemdukuamganvadila

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్