29/11/2026, Sunday · 08:18:04 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి!

Yakub Pasha 26/11/2026 8:39 PM ఖమ్మం

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి!
Want this news as a newspaper clip?Print News Clip
  • ఖమ్మంలో విద్యార్థులతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ ర్యాలీ
  • బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యం – జిల్లా అధ్యక్షులు దామల సత్యం

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి!

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి సామాన్యుడికీ అందేలా రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దామల సత్యం మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ పేదరికం, సామాజిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు పాలనలో, రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి పేదవాడికి, సామాన్యుడికి అందాలని స్పష్టం చేశారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ రాజ్యాధికార యాత్ర కొనసాగుతోందని తెలిపారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ, సామాజిక న్యాయం అందించేందుకు సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.ప్రతి విద్యార్థి, యువకుడు, పౌరుడు భారత రాజ్యాంగాన్ని చదివి అందులోని హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలను తెలుసుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దామల సత్యం, ఉపాధ్యక్షులు నాగార్జున, ఖమ్మం టౌన్ అధ్యక్షులు కొప్పుల రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు తేలపుట్ట జగపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు వినయ్, మహిళా నాయకులు నాగేశ్వరరావు, రమేష్, శ్రీనివాస్, లక్ష్మి తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాజ్యాంగాన్ని చదువుదాం.. హక్కులను తెలుసుకుందాం.. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడుదాం అని నాయకులు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి :: చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

Constitutional rightsavailablecommonperson

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు