29/11/2026, Sunday · 08:18:06 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ

Yakub Pasha 28/11/2026 9:31 PM ఖమ్మం

తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ
Want this news as a newspaper clip?Print News Clip
  • టీఎన్జీవోస్ అనుబంధ సంఘంగా గుర్తింపునకు అంగీకారం.. సభ్యులకు సభ్యత్వ రసీదుల అందజేత
  • – జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాగి వెంకన్న, బొమ్మెర ముత్యం

తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ

ఖమ్మం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్‌ను టీఎన్జీవోస్ సంఘంలో అనుబంధ సంఘంగా చేర్చుకోవాలని కోరుతూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాగి వెంకన్న, కార్యదర్శి బొమ్మెర ముత్యం ఆధ్వర్యంలో ప్రతినిధులు టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావును టీఎన్జీవోస్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సంఘాన్ని టీఎన్జీవోస్‌లో అనుబంధ సంఘంగా చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు గుంటుపల్లి శ్రీనివాసరావు అంగీకారం తెలిపారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. తదుపరి సభ్యులకు తన చేతుల మీదుగా సభ్యత్వ రసీదులను అందజేశారు.

ఈ సందర్భంగా గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సంఘ సభ్యులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఎన్జీవోస్‌ను మరింత బలోపేతం చేయడంలో సాంస్కృతిక సారథి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పమ్మి రవి, మిమిక్రీ సుధాకర్, మేడ ముత్తయ్య, కాల్వకట్ట జాన్, కోశాధికారి చాపలమడుగు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పరకాల అజయ్, సహాయ కార్యదర్శులు నకరికంటి వెంకటేశ్వర్లు, మాచర్ల కృష్ణ, బానోత్ రవి, మహిళా ప్రతినిధులు యంగల కుమారి, ముత్తమాల సునీత, ప్రచార కార్యదర్శి పిడియాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

pustakala avishkaranatelamganasamskrutikasarathisabhyatva

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు