29/11/2026, Sunday · 08:18:03 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం!

Yakub Pasha 26/11/2026 5:39 PM ఖమ్మం

అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం!
Want this news as a newspaper clip?Print News Clip

అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం!

 కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలి – విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలి

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్): అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్యం వికాసం చెందదని టీపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి వి.మనోహర్ రాజు అన్నారు. ఖమ్మం పట్టణంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశం తిప్పారపు లక్ష్మణ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.

సమావేశానికి ముందు తిమ్మిడి రఘు పీడీఎస్‌యూ బిగిపిడికిలి జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థి ఉద్యమ అమరవీరులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, చేరాలు రంగవల్లి, స్నేహలతలకు మౌనం పాటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వి.మనోహర్ రాజు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా విద్యారంగంలో అసమానతలను పెంచుతూ, కార్పొరేట్ విద్యావ్యవస్థను పాలకులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. విద్యలో అంతరాలు లేని సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ మాట్లాడుతూ ఒకప్పుడు ఉచితంగా అందిన విద్య నేడు సరుకుగా మారి పేద, బడుగు వర్గాలకు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దశాబ్దాల పాటు ఉచిత విద్య అందించిన దేశంలో నేడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు.ప్రొఫెసర్ కొఠారి కమిషన్ సూచించిన కామన్ స్కూల్ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని, జీడీపీలో విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీవైఎల్ మాజీ రాష్ట్ర కార్యదర్శి సీవై పుల్లయ్య, పీడీఎస్‌యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల అశోక్ ప్రసంగించారు. సమావేశంలో సుశాంత్, కార్తీక్, చరణ్, సిద్ధు, బాలు, గణేష్, అభిలాష్, ప్రణయ్, ప్రవీణ్, సుమంత్, చిట్టిబాబు, సింధు, ఐశ్వర్య, నాగశ్రీ, త్రిష తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్

educational opportunitiesDemocraticdevelopmentimpossiblesocietyunequal

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు!