23/10/2026, Friday · 07:44:31 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్

Yakub Pasha 22/10/2026 8:25 PM ఖమ్మం

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్
Want this news as a newspaper clip?Print News Clip
  • ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్
  • ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

ఖమ్మం, అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గ్రామసభల ద్వారా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులైన పేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శక విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. గ్రామసభలను నిర్వహించి ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.

గ్రామస్థాయిలో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎంపిక ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కలిగించాలని కోరారు.

ధర్నాలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు.

అలాగే సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఆవుల అశోక్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య, కోలా లక్ష్మీనారాయణ, కామ్రేడ్ పెద్ద చంద్రన్న పార్టీకి చెందిన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం–ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్, జిల్లా నాయకురాలు శారు కవిత, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు మాదారపు ఉమాశంకర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సప్పిడి వెంకటేశ్వర్లు, నాయకులు అయోధ్య అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పేదరికాన్ని జయించి డాక్టర్ కల సాకారం.. పందిరి ఆనంద్‌కు ఎంబీబీఎస్ సీటు!

Housing SelectionIndirammaTransparentlyDemandPartyLeaders

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

67 Posts

Latest News