05/11/2026, Thursday · 10:03:47 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం _ పీడీఎస్‌యూ

Yakub Pasha 05/11/2026 8:55 PM ఖమ్మం

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం _ పీడీఎస్‌యూ
Want this news as a newspaper clip?Print News Clip
  • రూ.8,200 కోట్ల పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
  • ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
  • విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను అడ్డుకోవాలి
  • విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
  • సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి
  • విద్యార్థుల ఓటు హక్కులు, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలి
  • విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమాలు నిర్మించాలి
  • సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతాం

విద్యారంగ సమస్యలపై విద్యార్థి సమరశంఖం పూరించాలి!

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం

సమానత్వ సమాజ స్థాపనకు విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలి

పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, వంగూరి వెంకటేష్ పిలుపు

ఖమ్మం, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
 ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ, విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, వంగూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. సమానత్వ సమాజ స్థాపన కోసం విద్యార్థులు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని, విద్యార్థి అమరవీరుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి అమరవీరుల మహాసభకు జిల్లా కోశాధికారి సురేష్ అధ్యక్షత వహించగా, జిల్లా సహాయ కార్యదర్శి సాదిక్ సభా నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. తొలుత విద్యార్థి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, వంగూరి వెంకటేష్ ప్రసంగించారు.

1960 దశకం చివరిలో దేశ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామ్రాజ్యవాద వ్యతిరేక, ప్రజాస్వామిక, జాతి విముక్తి ఉద్యమాల ప్రభావంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా పీడీఎస్‌యూ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కొలాశంకర్, చేరాలు, రంగవల్లి, రమణయ్య, సాంబయ్య తదితరులు విద్యార్థుల హక్కులు, శాస్త్రీయ విద్య, సమానత్వ సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా నడిపిస్తోందని విమర్శించారు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలకు తగిన నిధులు కేటాయించకపోవడం, ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయకపోవడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందించకపోవడం ఉన్నత విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.8,200 కోట్ల పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల జాప్యంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

విద్య అనేది ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే ఉపయోగపడే సాధనం కాదని, శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన, సమానత్వ భావనలను పెంపొందించే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఫీజుల భారం, విద్యా సమస్యలు, సామాజిక వివక్ష వంటి అంశాలపై విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేస్తూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని స్పష్టం చేశారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కు అని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన వారి హక్కులను హరించకూడదని పేర్కొంటూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించే శక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువల పరిరక్షణకు ముందుండాలని అన్నారు. విద్యార్థి ఉద్యమాలు కేవలం క్యాంపస్ సమస్యలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల సమస్యలపై స్పందించాలని సూచించారు.

ప్రభుత్వాలు విద్యారంగ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టకపోతే విద్యార్థులను ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు గాంధీ, సహాయ కార్యదర్శులు రాము, పవన్, అనిల్, శ్రీను, కావ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్

Movements PDSUEducationProblemsSolvedProgressiveStudent

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

167 Posts

Latest News

వైభవంగా నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థం.. నూతన జంటను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేతలు! కొదుమూరులో ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..! ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం! మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్ బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి_పోటు రంగారావు హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!