04/11/2026, Wednesday · 06:40:57 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అధికారులతో చింతకాని నూతన ప్రెస్ క్లబ్ మర్యాదపూర్వక భేటీ

Yakub Pasha 31/10/2026 12:08 PM ఖమ్మం

అధికారులతో చింతకాని నూతన ప్రెస్ క్లబ్ మర్యాదపూర్వక భేటీ
Want this news as a newspaper clip?Print News Clip
  • అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లేశ్వరి ఎన్నిక
  • కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య బాధ్యతలు
  • వివిధ శాఖల అధికారులతో నూతన కమిటీ భేటీ

అధికారులతో చింతకాని నూతన ప్రెస్ క్లబ్ మర్యాదపూర్వక భేటీ

చింతకాని, అక్టోబర్ 31 (పీపుల్స్ వాయిస్):

ప్రజా సమస్యల పరిష్కారం, మండల అభివృద్ధే లక్ష్యంగా చింతకాని నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నూతన అధ్యక్షురాలు జొన్నలగడ్డ మల్లేశ్వరి, కార్యదర్శి గుడిది పిచ్చయ్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శుక్రవారం మండలంలోని వివిధ శాఖల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి తమను పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, ప్రజలకు–అధికారులకు మధ్య వారధిగా పనిచేయడమే తమ ప్రధాన లక్ష్యమని కమిటీ సభ్యులు తెలిపారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గడ్డం విజయ్, గండారపు రామారావు, గంటల తిరుపతాచారి, శెట్టి సురేష్, చాపలమడుగు మంగతాయి, వేర్పుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

courtesy meetingcarefreepressclubofficials

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్