04/11/2026, Wednesday · 06:41:15 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్

Yakub Pasha 03/11/2026 11:41 AM ఖమ్మం

అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్
Want this news as a newspaper clip?Print News Clip

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థపై సమరభేరి!

కై కొండాయగూడెం వర్ధంతి సభను జయప్రదం చేయండి

కరపత్రాలను ఆవిష్కరించిన మాస్ లైన్ నాయకులు

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

దోపిడీ, పీడనలేని సమసమాజ స్థాపన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వర్ధంతి సభల్లో భాగంగా ఖమ్మం ఒకటో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కై కొండాయగూడెంలో నిర్వహించనున్న అమరవీరుల వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. శిరోమణి, ఖమ్మం డివిజన్ కార్యదర్శి టీ. ఝాన్సీ మాట్లాడుతూ.. దేశంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ పాలకవర్గాల విధానాల వల్ల పేద ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములై వ్యవస్థలో మార్పు కోసం కృషి చేయాలని సూచించారు.దేశంలోని సహజ వనరులను స్వదేశీ, విదేశీ బడా కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యంగా వేలాదిమంది అమరవీరులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధన కోసం కార్యకర్తలు నిరంతరం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కే. శ్రీనివాస్, ఒకటో పట్టణ కార్యదర్శి జాలాది లెనిన్, బొమ్మకంటి రమేష్, అయితనబోయిన వెంకన్న, హరీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

komdayagudem sabhanuamaravirulaashayasadhanakuporadalikai

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు