20వ సంవత్సరంలోకి ‘ప్రజా జ్యోతి’_ ఖమ్మం జిల్లా బ్యూరో అంతోటి శ్రీనివాస్

20వ సంవత్సరంలోకి ‘ప్రజా జ్యోతి’
ఖమ్మం అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్): పాఠకులు, విలేకరులు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషుల సహకారంతో ‘ప్రజా జ్యోతి’ దినపత్రిక 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని ఖమ్మం జిల్లా బ్యూరో అంతోటి శ్రీనివాస్ తెలిపారు. గత 19 ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిష్పాక్షిక వార్తలతో ప్రజల గొంతుకగా నిలిచామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పత్రిక అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మున్ముందు కూడా పాఠకుల ఆదరణ, ప్రకటనకర్తల సహకారం కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చదవండి :: ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ












