04/11/2026, Wednesday · 06:41:50 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం

Yakub Pasha 02/11/2026 3:01 PM ఖమ్మం

చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం
Want this news as a newspaper clip?Print News Clip

చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: జమ్ముల జితేందర్ రెడ్డి

చింతకాని,నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):

చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం సీపీఐ చింతకాని మండల సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచాలని కోరారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, దళితబంధు పథకం కింద గతంలో మంజూరైన రూ.15.50 కోట్లను 155 దళిత కుటుంబాలకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా 3,800 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇవ్వాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. పేదలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో పాటు ప్రతి ఒక్కరికీ 12 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంకటాయపాలెం నుంచి కొదుమూరు వరకు ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి విస్తరణను గ్రామాల్లో 50 అడుగులకు పరిమితం చేయాలని, చిన్నమండవ గ్రామంలో మున్నేరు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండపర్తి గోవిందరావు, ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్, కూచిపూడి రవి, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, జిల్లా సమితి సభ్యులు పర్చా రామచంద్రరావు, నారపోగు హేమ, మండల సహాయ కార్యదర్శులు మార్గం శ్రీను, రాఘవాపురం ఉపసర్పంచ్ అబ్బూరి మహేష్, నాయకులు పగిడిపల్లి ఏసు, దొబ్బల వెంగళరావు, పదిలం వెంకటనరసయ్య, గోగుల ఆది, గోగుల వెంకట్రావు, హుస్సేన్, గుండ్ల బేబీ రాణి, బస్వాపురం సర్పంచ్ ఆవుల నరసింహారావు, తుపాకుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

anxious issuesCPIfightsdemandsmemorandumTehsildar

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్