29/11/2026, Sunday · 09:07:45 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తుఫాను హెచ్చరిక.. అత్యవసరమైతేనే బయటకు రండి _చింతకాని ఎస్‌ఐ జి. నరేష్

Yakub Pasha 28/10/2026 9:26 AM ఖమ్మం

తుఫాను హెచ్చరిక.. అత్యవసరమైతేనే బయటకు రండి _చింతకాని ఎస్‌ఐ జి. నరేష్
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎస్‌ఐ సూచించిన జాగ్రత్తలు:
  • అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి
  • విద్యుత్‌ స్తంభాలు, తెగిపడిన విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలి
  • చెట్ల కింద, నిర్మానుష్య ప్రదేశాల్లో, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకూడదు
  • ప్రయాణించే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి
  • ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా, విద్యుత్‌ తీగలు తెగిపడినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

తుఫాను హెచ్చరిక.. అత్యవసరమైతేనే బయటకు రండి

ప్రజలకు చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ సూచన

చింతకాని, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్):
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఈదురుగాలుల కారణంగా విద్యుత్‌ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున విద్యుత్‌ స్తంభాలకు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని సూచించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ నరేష్ కోరారు.

ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్

SIG NareshCycloneAlertoutemergencyUnconcerned

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు!