04/11/2026, Wednesday · 06:42:44 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

విధి నిర్వహణలో మరణించిన ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

Yakub Pasha 27/10/2026 7:21 PM ఖమ్మం

విధి నిర్వహణలో మరణించిన ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
Want this news as a newspaper clip?Print News Clip
  • విధి నిర్వహణలో మరణించిన ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.
  • చెక్కును అందజేసిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

విధి నిర్వహణలో మరణించిన ఎస్సై కుటుంబానికి రూ.లక్ష సాయం
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెక్కు అందజేత
ఖమ్మం, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్): విధి నిర్వహణలో భాగంగా ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ఏడాది ఆగస్టు 23న మరణించిన ఎస్సై డి. అనంతరాములు కుటుంబానికి పోలీస్ శాఖ ఆర్థిక సాయం అందించింది. పోలీసు సిబ్బంది సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవడం పోలీస్ శాఖ బాధ్యత అని తెలిపారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏవో కళావతి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాధ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Financial assistancelakhfamilySaidiedlineduty

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్