04/11/2026, Wednesday · 06:39:32 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి_షేక్‌ హుస్సేన్‌ డిమాండ్‌

Yakub Pasha 29/10/2026 3:35 PM ఖమ్మం

తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి_షేక్‌ హుస్సేన్‌ డిమాండ్‌
Want this news as a newspaper clip?Print News Clip

తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ హుస్సేన్‌ డిమాండ్‌

తల్లాడ, అక్టోబర్ 29 (పీపుల్స్ వాయిస్): 

ఖమ్మం జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షాల కారణంగా తల్లాడ, కల్లూరు, మధిర, ఎర్రుపాలెం, వైరా, కొణిజర్ల, చింతకాని తదితర మండలాల్లో కోత దశలో ఉన్న వరిపైరు నేలకొరిగి నీట మునిగిందని తెలిపారు. పత్తి పంటలోనూ కాయల్లోకి నీరు చేరడంతో రైతులకు నష్టం వాటిల్లిందన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగుకు ఎకరానికి సుమారు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు, ప్రస్తుతం పంట చేతికందే సమయంలో నష్టపోవడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని షేక్‌ హుస్సేన్‌ కోరారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

crop dueGovthelpfarmerslostcycloneSheikhHussainDemand

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్