04/11/2026, Wednesday · 06:38:32 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

నవంబర్ 5న ఖమ్మంలో IUML ఉమ్మడి జిల్లా ప్రతినిధుల సమావేశం

Yakub Pasha 01/11/2026 3:08 PM ఖమ్మం

నవంబర్ 5న ఖమ్మంలో IUML ఉమ్మడి జిల్లా ప్రతినిధుల సమావేశం
Want this news as a newspaper clip?Print News Clip
  • నవంబర్ 5న ఖమ్మంలో IUML జిల్లా ప్రతినిధుల సమావేశం
  • నవంబర్ చివరి వారంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు
  • తమిళనాడు, కేరళ ఎంపీలు, మంత్రుల హాజరు
  • ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతంపై చర్చ
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా సమస్యలపై పోరాటల కార్యాచరణ

ఈ నెల 5న IUML ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధుల సమావేశం

ఖమ్మం, నవంబర్ 1 (పీపుల్స్ వాయిస్): 

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధుల సమావేశాన్ని ఈ నెల 5వ తేదీన ఖమ్మం పట్టణంలోని రెస్ట్ ఇన్ హోటల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా తెలిపారు.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఖమ్మం పట్టణానికి హాజరుకానుందని వెల్లడించారు. నవంబర్ చివరి వారంలో ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, ముందస్తుగా ఈ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

నవంబర్ చివరి వారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, మంత్రులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున చేపట్టాల్సిన పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు షేక్ బాజీ బాబా తెలిపారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Representatives MeetingIUMLJointDistrictKhammamNovember

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్