04/11/2026, Wednesday · 11:15:44 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు

Yakub Pasha 04/11/2026 9:27 PM ఖమ్మం

ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు
Want this news as a newspaper clip?Print News Clip
  • ఖమ్మంలో 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 900 మంది క్రీడాకారులతో జాతీయ కరాటే పోటీలు

ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

సుమన్ షాటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తండ్రి స్వర్గీయ నారాయణ జ్ఞాపకార్థం ఖమ్మం వర్తక సంఘం ఆవరణలో ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు, కరాటే గ్రాండ్ మాస్టర్ సుమన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఖమ్మం బుర్హాన్‌పురంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వద్దిరాజు రవిచంద్రను కలిసిన అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్

Rao felicitatedJallelaSrinivasaVaddiRajupresentedmemento

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

157 Posts

Latest News

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం! రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!ఎస్సై జి. నరేష్ హెచ్చరిక జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్