ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్

- ఖమ్మం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి.
- రైతులకు పంట నష్టపరిహారం, రుణమాఫీ, కొత్త రుణాలు అందించాలి
- రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
- చెరువులు, కుంటలను సాగర్, గోదావరి జలాలతో నింపాలి
- తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
- రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలి
- నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రబీ పంటలను ప్రోత్సహించాలి
ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్
ఖమ్మం, అక్టోబర్ 27 ( పీపుల్స్ వాయిస్ ):
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మాన్ని తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ. వెంకన్న, సహాయ కార్యదర్శి గుగులోత్ పటేల్ డిమాండ్ చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్లకు మద్దతు తెలిపారు.
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, సాగర్, గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపాలని కోరారు. పంట నష్టాలను అంచనా వేసి పరిహారం అందించడంతో పాటు అర్హులైన రైతులకు రుణమాఫీ, కొత్త రుణాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలని, రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని












