04/11/2026, Wednesday · 06:38:48 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర

Yakub Pasha 03/11/2026 4:55 PM ఖమ్మం

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర
Want this news as a newspaper clip?Print News Clip
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి ఖమ్మం మహిళలకు అండగా నిలుస్తా
  • ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన
  • కుట్టుమిషన్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

మహిళల సాధికారతకు మరిన్ని నిధులు తీసుకొస్తా!

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం మహిళల సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. పేదరికంలో ఉన్న మహిళలు, ఒంటరి మహిళలు స్వయంకృషి, ఆత్మగౌరవంతో జీవించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని కే.సీ. పుల్లయ్య ఫౌండేషన్ నారీ నైపుణ్య శిక్షణా కేంద్రంలో మంగళవారం ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన అనంతరం జీ మాల్ ఉమామహేశ్వరరావుతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, ఆత్మగౌరవంతో జీవించేందుకు కే.సీ. పుల్లయ్య ఫౌండేషన్, థెరిస్సా మహిళా మండలి, ఎస్వీ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటులో పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన భూమిక పోషించిందని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా మానవీయ దృక్పథంతో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని కొనసాగాలని ఆకాంక్షించారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూలై 24న వరంగల్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 'స్మైల్ ఏ గిఫ్ట్' కార్యక్రమం ద్వారా 2 వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు బహూకరించారని ఎంపీ గుర్తుచేశారు. తన గాయత్రి గ్రానైట్స్ సంస్థతో పాటు జీ మాల్ ఉమామహేశ్వరరావు సహకారంతో మరికొంతమంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తామని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా శిక్షణా కేంద్రం విస్తరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.చిన్న పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన వారిని సూరత్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చూశానని చెప్పారు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అటువంటి వారికి అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు.అనంతరం నిర్వాహకులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు పూలకుండీ అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చల్లా సుధా, సుందరరావు, స్వప్న, ఖతీజా, ఆవుల నాగమణి, ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

women RavichandraKhammambringfunds

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు